21-01-2026 08:17:02 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహకురాలు భోజనం సరిగా పెట్టడం లేదని, భోజనం మెనూ ప్రకారం పెట్టండం లేదని బుధవారం విద్యార్థులు బహిష్కరించారు. మండలంలోని బొమ్మనపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం మంగళవారం 30 మంది విద్యార్థులు బహిష్కరించగా... బుధవారం 112 విద్యార్థులకు 91 మంది హాజరుకాగా... అందులో 48 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించారు.
కొంతకాలంగా మధ్యాహ్న భోజనం సరిగా పెట్టడం లేదని భోజన నిర్వహకురాలిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటివలే వంటశాలలో 117 కేజీల బియ్యం వంటశాలలో దొరకడంతో టేకులపల్లి ఆర్ఐ పంచానామా నిర్వహించి, బియ్యం స్థానిక డీలర్ కు అప్పజెప్పారు. మధ్యాహ్న భోజన నిర్వహకురాలు విద్యార్థులపై దురుసు ప్రవర్తన చేసినప్పటికి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు వంట నిర్వహకురాలిని మార్చి తమకు నాణ్యమైన భోజనం పెట్టాలని, అప్పటివరకు ఇంటి భోజనమే చేస్తామని విద్యార్థులు తెలుపుతున్నారు.