1 June, 2026 | 4:32 PM

Breaking News

సింగరేణిలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల   •   విద్యుత్ శాఖ నిర్లక్ష్యం   •   జొన్నల తూకం కాంటా కోసం కొట్లాడుతున్న రైతులు   •   అందరికీ ఉద్యోగం ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదు: TGPSC చైర్మన్   •   వరి ధాన్యం సాగులో దేశంలో తెలంగాణ మొదటి స్థానం   •   తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్   •   తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల హామీలపై సీఎం స్పష్టత ఇవ్వాలి   •   గిరిజాయి గ్రామంలో అగ్ని ప్రమాదం రెండు లక్షల నగదు ఆరు లక్షల ఆస్తి నష్టం.   •   బీఎంఎస్ఆర్యు రాష్ట్ర అధ్యక్షుడిగా పప్పుల సురేష్   •  

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం

01-06-2026 04:01 PM

గుంతలు తవ్వి వదిలేసిన అధికారులు, కాంట్రాక్టర్

ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు

మేడిపల్లి,(విజయకాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పీర్జాదిగూడ డివిజన్ మల్లకార్జున నగర్‌లో 11 కె.వి భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు స్థానికులకు ఇబ్బందికరంగా మారాయి. విద్యుత్ కేబుల్ ఏర్పాటు కోసం రోడ్లపై తవ్విన గుంతలను పూడ్చకుండా కేబుల్ పనులను మున్సిపల్ శాఖ, హెచ్ఎండబ్ల్యూఎస్, ఎస్బి అధికారుల సమన్వయ లోపంతో అధికారులు, కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే ఇరుకైన వీధుల్లో ఇళ్ల ముందే పెద్ద గుంతలు ఉండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు రాకపోకలు సాగించడంలో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా తవ్విన మట్టిని, రోడ్డు శిథిలాలను అక్కడే వదిలేయడంతో దుమ్ము, ధూళి సమస్యలు కూడా పెరిగాయని ప్రజలు చెబుతున్నారు.

ఒకవైపు వాటర్ లైన్ పక్కనే 11 కె.వి కేబుల్ వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతుండగా మరోవైపు పనులు అసంపూర్తిగా వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు. తక్షణమే విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ స్పందించి గుంతలను పూడ్చి, రోడ్లను యథాస్థితికి తీసుకురావాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.