డివైడర్‌కు క్యూరింగ్ మరిచిన అధికారులు
12-08-2026 12:56 AM
రాజేంద్రనగర్, ఆగస్టు 11 (విజయ క్రాంతి): ప్రమాదాలను నివారించేందుకు జి హెచ్ ఎం సి రాజేంద్ర నగర్ సర్కిల్ అధికారులు రూ : 5 .09 కోట్లతో 4.5 కిలోమీటర్ల మేర నిర్మించే డివైడర్ పనుల ల్లో అధికారులు నాణ్యతకు తిలోదకాలు ఇచ్చినట్లు ఆ రోపణలు ఉన్నాయి. నాలుగు కాలాల పా టు మన్నిక గా ఉండాల్సిన డివైడర్ కు సరి గా క్యూరింగ్ చెయ్యక పోవడంతో డివైడర్ నాణ్యత ప్రశ్నార్థకంగా తయారైంది.. పాత గోనే సంచులను నూతనంగా నిర్మించిన డివైడర్లపై వేసి నీరు పోయడం మరిచారు .కేవలం తట్టు సంచులు ఒక్క సారీ తడిపిన దాఖలాలు లేవు. క్యూరింగ్ లేకపోతే నాణ్యత ప్రమాణాలు ఎలా ఉంటాయని బీజేపీ నాయకుడు మహేష్ యాదవ్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు..






