12 August, 2026 | 2:14 AM

బాధితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి

12-08-2026 12:56 AM
  1. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
  2. ఖార్ఖానాలో బాధితుల దీక్షకు మద్దతు 

సికింద్రాబాద్, ఆగస్టు 11 (విజయక్రాం తి): రాజీవ్ రహదారి విస్తరణ ప్రాజెక్టులో భూములు, ఇళ్లు, భవనాలు కోల్పోతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిరక్ష్య వైఖరికి వ్యతిరేకంగా తేలుకుంట సతీష్ ఆధ్వర్యంలో కార్ఖానా అంబే ద్కర్ విగ్రహం వద్ద బాధితులు నిర్వహించిన దీక్షకు మంగళవారం ఆయన బీజేపీ తరఫున సంఘీభావం తెలిపారు.

రోడ్డు విస్తరణ కోసం భూములు, ఇళ్లు, భవనాలు కోల్పోతున్న ప్రజలు అభివృద్ధికి వ్యతిరేకం కాదని రాంచందర్ రావు స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనం కోసం చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు అందరూ సహకరిస్తున్నారని, అయితే తమ ఆస్తులను త్యాగం చేస్తున్న ప్రజలకు సరైన విలువతో కూడిన న్యాయమైన పరిహారం అందాల్సిన అవసరం ఉందన్నారు.

తూంకుంట ప్రాంతంలో భూముల పరిహారాన్ని పెంచిన విధంగా, రాజీవ్ రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న ఖార్ఖానా ప్రాంత ప్రజలకు కూడా తగిన మేర పరిహారం పెంచాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తూంకుంటలో ఏ మేరకు పరిహారం పెంచిందో, అదే విధంగా ఇక్కడ కూడా సముచితమైన శాతం మేర పరిహారం పెంచి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.