calender_icon.png 3 November, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్ హెచ్-65పై నీటి నిల్వ ప్రదేశాన్ని పరిశీలించిన అధికారులు

03-11-2025 12:22:58 PM

పోతరాజు కుంట ఆక్రమణ వలన నీటి నిల్వ.

పనులను పునరుద్ధరించి శాశ్వత పరిష్కారం. ఆర్డిఓ అశోక్ రెడ్డి.

చిట్యాల,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాలలో జాతీయ రహదారి(National Highway) 65 పై రైల్వే అండర్ పాస్ వద్ద వర్షపు నీరు నిలుస్తున్న ప్రదేశాన్ని ఎన్ఎచ్ఎఐ అధికారులతో కలిసి ఆర్డీఓ అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్, తహసిల్దార్ బి. విజయ,  రెవిన్యూ అధికారులు సోమవారం పరిశీలించారు. ఆర్డీఓ అశోక్ రెడ్డి మాట్లాడుతూ... భారీ వర్షాల కారణంగా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద నీరు నిలవడంతో గత మూడు రోజుల నుంచి జాతీయ రహదారి 65 పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది.

ఎస్ డిఆర్ఎఫ్, ఫైర్, మున్సిపల్ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొని మోటార్లు పెట్టి ఎప్పటికప్పుడు నీటిని బయటికి ఎత్తేస్తున్నారని అన్నారు. చిట్యాల పట్టణానికి సంబంధించిన వర్షపు నీరు జాతీయ రహదారి నుంచి పోతరాజు కుంటకు వెళ్లే విధంగా గతంలో  ఎన్ హెచ్ ఎఐ  వాళ్ళు ఏర్పాటు చేశారని, పోతరాజు కుంట ఆక్రమణకు గురి కావడం వలన, మున్సిపల్ వాళ్లు చెత్త వేయడంతో కుంట నీరు నిలువకుండా పూర్తిగా కుంగిపోతుందని, దింతోనే రైల్వే అండర్ ప్రాస్ కింద నీరు నిలిచిపోతుందని పేర్కొన్నారు. పోతరాజు కుంటలో ఉన్న ఆక్రమాలను తొలగించి నీరు నిలిచే విధంగా పనులను పునరుద్ధరించి శాశ్వత పరిష్కారం చేస్తామని, పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ కి సమర్పించి కలెక్టర్ ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతాం అని తెలియజేశారు.