17 April, 2026 | 2:11 PM

Breaking News

కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •  

మెప్మా రుణాల అవినీతిలో అధికారులదే కీలకపాత్ర

16-05-2025 12:00 AM
  1. రుణాల పేరుతో అమాయక మహిళలను మోసం చేశారు

బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉంది

ఐదు రోజుల్లో విచారణ పూర్తి చేస్తాం 

జిల్లా ఆడిట్ అధికారి జయ శ్రీ

గజ్వేల్ మే 15: మెప్మా రుణాల అవినీతిలో గజ్వేల్ మెప్మా  అధికారులు, రిసోర్స్ పర్సన్ ల కీలక పాత్ర ఉన్నట్లు విచారణ అధికారి, జిల్లా ఆడిట్ ఆఫీసర్ జయశ్రీ తెలిపారు.  గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లోని మెప్మా  మహిళా సంఘాలకు రుణాల మంజూరీలో జరిగిన అవకతవకలపై శ్యామల అనే మహిళ ఫిర్యాదుతో అడిషనల్ కలెక్టర్ గారిమ అగర్వాల్ ఆదేశాల మేరకు జిల్లా ఆడిట్ ఆఫీసర్ జయ శ్రీ గురువారం విచారణ ప్రారంభించారు.

మొదటిరోజు విచారణ పూర్తయిన అనంతరం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్  కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. మహిళా సంఘాల్లోని అమాయక మహిళలను రుణాలు ఇప్పిస్తామని మోసం చేసి మెప్మా ఆర్పీలు అధికారులే ప్లాన్ ప్రకారంగా  డబ్బులు కాజేసినట్లు   అర్థమవుతుందన్నారు. మెప్మా అధికారులకు బ్యాంకు అధికారులకు కూడా సహకరించినట్లు తాము గుర్తించామన్నారు.

అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశాల మేరకు  మహిళా సంఘాల సభ్యులందరికీ జరిగిన అన్యాయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేస్తామన్నారు. ఇప్పటివరకు తాము చేసిన విచారణలో  అమాయకమైన మహిళలను ఆసరాగా చేసుకుని బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించి ఆర్ పి తోపాటు మరొక మహిళ కూడా డబ్బులు కాదేశారని గుర్తించామన్నారు.   

మరో నాలుగు రోజులపాటు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి మహిళా సంఘాల సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ విచారణలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య, మెప్మా పీడీ హనుమంత్ రెడ్డి, అధికారులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.