17 April, 2026 | 2:01 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

కాళేశ్వరం అవినీతి పరులను వదిలిపెట్టేది లేదు

16-05-2025 12:00 AM
  1. తుమ్మిడిహెట్టి బ్యారేజీని తక్షణమే నిర్మించాలి 
  2. తెలంగాణ జలసాధన సమితి 

ఖైరతాబాద్; మే 15 (విజయ క్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపరులను వదిలిపెట్ట బోయేది లేదని  పలువురు వక్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాళేశ్వరానికి వేల కో ట్లు కుమ్మరించి ప్రజాధనం దుర్వినియోగం చేసిన గత గత పాలకులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం పునరుద్ధరణ పక్కన పెట్టి తక్షణమే తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించాలని కోరారు.

జాతీయ డ్యాంల భద్రత సంస్థ (ఎన్డీఎస్‌ఎ) తుది నివేదిక నేపథ్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జలసాదన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎలిసి కోదండరామ్, హైకోర్టు మాజీ న్యాయమూ ర్తి జస్టిస్ చంద్రకుమార్, కాంగ్రెస్ మాజీ ఎం పి మడుయాష్కీ, మాజీ మంత్రి విజయరామారావు , ప్రముఖ నీటిపారుదల నిపణు లు పి.జి. శాస్త్రి, సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట రామయ్య తది తరులు హాజరై మాట్లాడారు.

మేడిగడ్డ తది తర బ్యారేజీల పునరుద్ధరణకు డబ్బు వృథా చేయకుండా తుమ్మిడిహెట్టి నిర్మించడమే మేలన్నారు. కాళేశ్వరం మూడు బ్యారే జీల పేరిట గోదావరికి ఎదురుగా ఎత్తిపోతలు నిర్మించడం ఆ వివేకమైన చర్యా అని అన్నారు.  15 నెలలైనా ఎన్డీఎస్‌ఎ అన్ని నివేదికలిచ్చినా కాళేశ్వరం అవినీతిపరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు శిక్షించడం లే దని ప్రశ్నించారు.

మాజీ ఎంపి మడుయా ష్కీ మాట్లాడుతూ కెసిఆర్ ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా లేడని, దోపిడీదారుగా ఉన్నారని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిలో ఒక బధికారి దనర్జన రూ.300 కోట్లు అయితే, గత ప్రభుత్వ పెద్దల వద్ద ఎన్ని వేల కోట్ల దనం ఉండాలన్నారు. కాళేశ్వరంపై వినీతికి పాల్బడిన పాలకులను కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్ట బోడన్నారు. దీనిపై సిఎంను, నీటిపారుదలశాఖ మంత్రిని కలుద్దామని తీర్మా నించారు. 

దేశవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జరిగిన చర్చ మరే ప్రాజెక్టులో జరగలేదన్నారు.  మేడిగడ్డలో 16, అన్నారంలో 12, సుందిళ్ల బ్యారేజీల్లో 8 టిఎంసిల నీరునిల్వ అత్యంత ప్రమాదకరమన్నారు. వెంకటరామయ్య మాట్లాడుతూ మూడు బ్యారేజీలలో గత ప్రభుత్వ పెద్దలు అధికారులు తప్పులను ఎత్తిచూపి బాడ్యులపై చర్య లు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

స మావేశంలో ప్రాణహిత పరిరక్షణ వేదిక కన్వీనర్ కె. విప్రతాప్. మాజీ ఇంజినీర్ విఠల్రావ్. సుథ్వీరాజ్, ఆర్నలిస్టు అవడాని, చీఫ్ ఇంజినీర్ జియోఉడీన్. సాంబశివరావు. సిపిఐ ఎంఎల్ నేతలు ఉపేందర్రెడ్డి, ప్రసాద్. ఎఐకెఎంఎస్ నేత కోటేశ్వరరావు పాల్గొన్నారు