కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజన్
సికింద్రాబాద్, జూలై 1 (విజయ క్రాంతి): ఏఐఎస్‌ఎఫ్ జాతీయ సమితి పిలుపు మేరకు నీట్ పరీక్ష పేపర్ లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్ ఓయూ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆరట్స్ కాలేజీ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షలమంది రాసినటువంటి నీట్ పరీక్ష పేపర్ లీకుల కారణంగా ఆత్మహత్య చేసుకుని పదుల సంఖ్యలో విద్యార్ధులు చనిపోవడం, 2022, 2024 సంవత్సరాలలో వరుసగా నీట్ పరీక్ష లీకులయితో విస్వసనీయతను కోల్పోయినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీ పరీక్ష నిర్వహణ అప్పగించడాన్ని ఖండిస్తూ లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దేశ వ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన నీట్ పేపర్ లేకులకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నప్పటికీ స్పందించ కుండా కేంద్రం మొండిగా వ్యవహరిస్తుందని ఏదేదో కామెంట్ చేయడం సిగ్గుచేటు అని దినేష్ శ్రీరంగరాజన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ, రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెహమాన్, ఓయూ కార్యదర్శి లెనిన్, అధ్యక్షుడు ఉప్పల ఉదయ్ కుమార్ రాష్ట్ర సమితి నాయకులు శాంతి, అన్వర్, నెల్లి సత్య, హరీష్, మహేష్ దొండి రామ్ మధు సుమన్ భాను దామోదర్,హరీష్ పాల్గొన్నారు.






