14 August, 2026 | 2:58 AM

భూములు గుంజుకుంటే తీవ్ర పరిణామాలు

14-08-2026 01:43 AM
  1. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
  2. తారామతిపేట్ వ్యవహరంలో 24 గంటల్లోకి చర్యలు తీసుకోవాలి
  3. లేకుంటే సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరిక

ముషీరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాం తి): బీసీల భూములను కబ్జా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట్‌లో బీసీల భూముల వ్యవహారంపై 24 గంటల్లోగా వి చారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

భూముల రక్షణకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోతే సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై త్వరలో డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సర్వే నంబర్ 36లో ప్రభుత్వ రికార్డులను నమ్మి భూము లు కొనుగోలు చేసిన వారికి న్యాయం చేయాలని, ఓఆర్‌ఆర్ భూమిగా చూపుతున్న అంశంపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని సమావేశంలో డిమా ండ్ చేశారు. 

భూమి విక్రయదారు నందనూ రి కిరణ్ సాగర్, కొనుగోలుదారు చిలువేరు కిరణ్ తమకు న్యాయం చేయాలని కోరారు. బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ వడ్డెర, బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానగంటి విజయ్ గౌడ్, విద్యార్థి సంఘం అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్, చందు, నంద గోపాల్, సుధీర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.