23 April, 2026 | 10:43 PM

ఖమ్మం హోటళ్లపై అధికారుల దాడులు

27-06-2024 12:39 AM

ఖమ్మం, జూన్ 26(విజయక్రాంతి): వైరా రోడ్డులోని స్పందన ఫుడ్ ప్యాలెస్, కోణార్క్ రెస్టారెంట్, పాత బస్టాండ్ రోడ్డులోని శ్రీ ప్రియలక్ష్మి బేకరీ, జనరల్ స్టోర్స్‌లను బుధవారం అదనపు కలెక్టర్, రెవెన్యూ అధికారులు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కిరణ్‌కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రతను పాటించాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ సూచించారు. రెస్టారెంట్‌లో వాడే ప్రతి ప్యాక్‌కి తయారీ, కాలపరిమితి నమోదు ఉండాలన్నారు. కిచెన్‌లో పనిచేసే వారందరు శుభ్రంగా వుండేలా, చేతులకు, తలకు మాస్క్ లు ధరించేలా చూడాలన్నారు. వినియోగదారులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.