ఫామ్‌హౌస్‌కు బీఆర్‌ఎస్ నేతల క్యూ
ఎర్రవెల్లిలో కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు, నేతలు
హైదరాబాద్, జూన్ 26( విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను బుధవారం పలువురు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ కీలక నేతలు, కార్యకర్తలు ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో కలిశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను పలకరిస్తూ కేసీఆర్ వారితో ఫొటోలు దిగారు. అనంతరం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో సమావేశమయ్యారు. కొద్దిరోజులుగా పార్టీ నేతలతో ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ భేటీ అవుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా మరికొంత మంది నాయకులు కలిసినట్లు తెలుస్తోంది.
కేసీఆర్‌ను ఎర్రవెల్లిలో కలిసిన వారిలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, జమగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి , మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ముఖ్యనేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సుధీర్‌బాబు, పల్లె రవిగౌడ్, రజినీ సాయిచంద్ తదితరులు ఉన్నారు. వీరితో పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది.






