15-07-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రంభీం అసిఫాబాద్ ,జూలై 14(విజయ క్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో అధికారులు మార్గదర్శకాలు ప్రకారం విధు లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి తో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల మార్గదర్శకాలు, నిబంధనలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లా పంచాయతీ అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి తప్పులకు తావు లేకుండా విధులు నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ కేం ద్రాలలో ఏర్పాట్లు, పోలింగ్ నిర్వహణకు అధికారులు, సిబ్బంది నియామకం కొరకు జాబితా రూపొందించాలని, ఎన్నికల మార్గదర్శకాలను పూర్తిగా తెలుసుకోవాలని తెలి పారు.
ఎన్నికలు నిర్వహించే సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని తెలిపారు. గ్రామాలలో పారిశుధ్యం పై సమీక్షలు నిర్వహించాలని, వర్షాకాలంలో దోమల వృద్ధిని నియంత్రించేందుకు దోమల మందు, ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేయాలని తెలిపారు. భారీ వర్షాలు కారణంగా వాగులు పొంగిన సమయంలో అటువైపుగా ప్రజలు వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని, వరదల సమయంలో నిరాశ్రయాలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన కల్పిం చాలని తెలిపారు.
వన మహోత్సవం కార్యక్రమంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షప తి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి లక్ష్మీనారాయణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు .