calender_icon.png 15 July, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం

15-07-2025 12:00:00 AM

తరగతి గదుల పెండింగ్ పనులను పరిశీలించిన మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, జూలై 14 (విజయక్రాంతి):  విద్యారంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. పెండింగ్ పనులకు బిల్లులు చెల్లించకుండా అలసత్వం వహిస్తోందని ఆరోపించారు. సోమవారం భీంసరి ప్రభుత్వ పాఠశాలను బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించి, ఈ సందర్భంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడ నిర్మాణం నిలిచిపోయిన పనులను పరిశీలించారు.

ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ... గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి కింద రూ.30 లక్షలతో అదనపు తరగతి గదులు, రూ.17 లక్షలతో కంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. గత సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలకు సబంధించిన బిల్లులు ఇవ్వకపోవడం సరైనది కాదని అన్నారు. ప్రభుత్వ పాటశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన పూర్తి చర్యలు తీసుకోవాలన్నారు.

భీంసరి లో 287 మందికి గానూ 36 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నారని, మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మాజీ ఎంపీపీలు సేవ్వా జగదీష్, గండ్రత్ రమేష్, బట్టు సతీష్, కనక రమణ, దేవిదాస్, కుమ్రా రాజు, రాజేష్, కొత్తపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు..