15-07-2025 12:00:00 AM
మేడ్చల్ అర్బన్, జూలై 14(విజయ క్రాంతి): గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా అంత స్తుల మీద అంతస్తులు నిర్మిస్తున్నారు. కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లు ని ర్మిస్తున్నారు.
అనుమతి లేకుండా భవనాలు నిర్మిస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొ డుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవ డం లేదు. గుండ్ల పోచంపల్లి పరిధిలోని కం డ్లకోయ రహదారిపై ఉన్నటువంటి మైల్ స్టో న్ డెవలపర్స్ భవనంపై అనుమతులు లే కుండా పెద్ద ఎత్తున షెడ్డు నిర్మాణం చేస్తున్నారు. మున్సిపల్ అధికారు లు అక్రమ నిర్మాణం అని నోటీసు ఇస్తే బిల్డర్ తీసుకోవ డం లేదు.
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి
కండ్ల కోయలోని రహదారిపై ఉన్న మైల్ స్టోన్ డెవలపర్స్ భవనంపై నిర్మిస్తున్నటువం టి షెడ్డు విషయంలో కాంగ్రెస్ మాజీ ఎ మ్మెల్యే ఒకరు మున్సిపల్ అధికారులపై ఒత్తి డి చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ నేతల అండదండలు ఉండడంతో బిల్డర్ దర్జాగా షెడ్డు ని ర్మిస్తున్నారు. మున్సిపల్ అధికారుల నోటీసు కూడా స్వీకరించడం లేదంటే ఎంత జబర్దస్త్ గా నిర్మిస్తున్నా రో అర్థమవుతోంది.
ఈ అక్రమ నిర్మాణం పై గుండ్ల పోచంపల్లి బి జెపి నాయకులు సోమవారం అదనపు కలెక్టర్ రాధిక గుప్తాకు ఫిర్యాదు దీనిని వెం టనే కూల్చివేయాలని వారు కోరారు. కాగా ఈ అక్రమ నిర్మాణం పై సిడిఎంఏ, లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తామని బిజెపి నా యకులు తెలిపారు.
టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నట్లా.. లేనట్లా..?
మున్సిపాలిటీ వ్యవస్థలో టౌన్ ప్లానింగ్ విభాగం కీలకపాత్ర పోషిస్తుంది. అయితే అందుకు సంబంధించిన అధికారులు గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో అందుబాటులో ఉండనే ఉండరని పలు ఆ రోపణలు వినిపిస్తున్నాయి.
గుండ్ల పోచంప ల్లి పట్టణ పరిధిలో యదేచ్చగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారి సదరు నిర్మాణదారులపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.టౌన్ ప్లానింగ్ విభాగం అధికారి ము న్సిపల్ ఆఫీసులో ఉంటున్నారా..? అసలు విధులకు హాజరవుతున్నారా అని పలువురు స్థానిక పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు..
నోటీసు ఇస్తే తీసుకోవట్లేదు: కమిషనర్
కండ్లకోయలోని మైల్ స్టోన్ డెవలపర్స్ భవనంపై నిర్మిస్తున్నటువంటి షెడ్డు విషయంలో చర్యలు ఎందుకు తీసుకోవడం లేద ని మున్సిపల్ కమిషనర్ ను వివరణ కోర గా.. సదరు వ్యక్తులకు మునిసిపల్ సిబ్బంది నోటీసు అందజేయడానికి వెళ్తే వారు నోటీసును స్వీకరించడం లేదని కమిషనర్ స్వామి నాయక్ తెలిపారు.