calender_icon.png 19 July, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా అధికారులు చొరవ చూపాలి

19-07-2025 12:22:49 AM

దిశా చైర్మన్ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 

రంగారెడ్డి, జూలై 18( విజయ క్రాంతి): కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చే వెళ్ల ఎంపీ, దిశా కమిటీ చైర్మన్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.దిశ అంటే ఒక మార్గం, అభివృద్ధి అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా జిల్లా అధికారులు చొరవ చూపాలని ఆయన సూచించారు.

శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసా యం, గ్రామీణ అభివృద్ధి, బ్యాంకర్లు, పంచాయితీ రాజ్, శిశు సంక్షేమం, పౌర సరఫరాలు, పరిశ్రమలు, పశు సంవర్ధక శాఖ, మిషన్ భగీరథ, రూరల్ వాటర్ సప్లై, జాతీయ రహదారులు, గృహ నిర్మాణ శాఖ, మార్కెటింగ్, అటవీ, ఇరిగేషన్, ఆర్‌అండ్ బి, మున్సిపల్ శాఖల అధికారులతో చేపట్టిన పనులు, పథకాలు అమలుపై జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డితో కలిసి ఎంపీ స మీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు,వాటి ప్ర యోజనాలు, ఎంత సబ్సిడీ అందుతుందనేది ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులు తె లుసుకోవాలని, ప్రభుత్వ పథకాలపై గ్రామాలు, మండల, పట్టణ కేంద్రాల్లో సభల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు.

జిల్లాలో మష్రుమ్ (పుట్టగొడుగుల) పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, అదే విధంగా గాలివానకు జిల్లాలో ధ్వంసమైన జిల్లాలో పాలీహౌస్ల పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులకు తెలిపా రు.అంగన్వాడీలు, పాఠశాలల్లో పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని, గుడ్డుతో పాటు సోయామిల్క్ అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారికి ఎంపీ సూచించారు.

ముఖ్యంగా జిల్లాలోని చెరువుల్లో ఆంధ్రా, ఇతర రాష్ట్రాల నుంచి దళారీలు వచ్చి సొసైటీలను లీజుకు తీసుకుని చేపలు పట్టడంతో దళారులకు లాభం చేకూరుతుందని అన్నారు. జిల్లాలోని మత్స్యకారులకు చేపలు పట్టే విధానంపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇప్పించి కావాల్సిన వలలను కూడా అందజేయాలని, తద్వారా స్థానిక మత్స్యకారులకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంద ని ఎంపీ సంబంధిత శాఖ అధికారికి సూచించారు.

జిల్లాలో ఇదివరకే నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో స్థానికులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా హౌసింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని డబుల్ ఇండ్లకు సంబంధించిన వివరాలను అందజేయాలన్నారు. బ్యాంకు రుణాల విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, జిల్లాలో కే టాయించిన లక్ష్యానికి అనుగుణంగా అన్ని రంగాలకు విరివిగా రుణాలను అందించాలని ఎంపీ బ్యాంకర్లను ఆదేశించారు.

ముద్ర, విశ్వకర్మ పథకాలతో పాటు చిరు వ్యాపారస్తులు ఆర్థికంగా అభివృద్ధికి చెందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి సత్వరమే రుణాలు అందేలా చొరవ తీసుకోవాలని ఎంపీ ఆదేశించారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రధాన, ఇతర రహదారులను పూర్తి చేయాలని, చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టాలని ఎంపీ సంబంధిత శాఖల అధికారులకు తెలిపారు.

అనంతరం చేవెళ్ల, రాజేంద్రనగర్ ప్రాంత రైతుల కోసం మిల్క్ సెంటర్ ఏ ర్పాటు చేయాలని దిశ కమిటీ సభ్యులు ఎంపీకి విన్నవించారు. జిల్లాలోని ఆయా ఆసుపత్రుల్లో పశు సంవర్ధక శాఖ అధికారులు అందుబాటులో ఉండడం లేదని దిశా కమిటీ సభ్యులు కలెక్టర్ దృష్టికి తేగా, ఆయన స్పందిస్తూ గోపాలమిత్ర పథకంలో భాగంగా అధికారులు నిరంతరం అం దుబాటులో ఉండి పశువులకు సత్వరమే వైద్య సేవలు, సలహాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

సమావేశంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ఎంపీ, కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్డీఓ శ్రీలత, డీపీఓ సురేష్ మోహన్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి ఉష, ఉద్యానవన శాఖ అధికారి సురేష్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.