19-07-2025 12:21:11 AM
బ్యాడ్మింటన్ అండర్-19 విజేతగా నిలిచిన అల్లువెల్లి అర్జున్
మంచిర్యాల, జూలై 18 (విజయక్రాంతి) : మహారాష్ర్ట నాందేడ్ జిల్లాలో ఈ నెల 14 నుంచి 18 వరకు జరిగిన యోనెక్స్ సన్ రైస్ మహారాష్ర్ట జూనియర్ స్టేట్ సెలెక్షన్ బ్యా డ్మింటన్ టోర్నమెంట్‌లో అండర్-19 సింగి ల్స్ విభాగంలో అల్లువెల్లి అర్జున్ విన్నర్‌గా నిలిచాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ నివాసి అల్గువెల్లి రఘునాథ్ రెడ్డి- హేమ దంపతుల కుమారుడైన అర్జున్ చిన్నప్పటి నుంచి బాంబేలో బ్యాడ్మింటన్‌లో శిక్ష ణ పొందాడు.
ఇతని తల్లిదండ్రులు బాంబే లో ఉద్యోగం చేస్తున్నారు. శిక్షణలో మరింత మెలుకువలు సాధించేందుకు అతన్ని హైదరాబాద్ లోని భాస్కర్ బాబు బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ ఇప్పించారు. మహారాష్ర్టలోని ముంబాయి ఉపనగర్ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించి 16 సంవత్సరాల వ యసు ఉన్నప్పటికీ అండర్ 19 రాష్ర్ట ఛాంపియన్‌గా నిలిచాడు. ఫైవల్ మ్యాచ్‌లో ముం బాయికి చెందిన ఆర్యన్ తల్వార్ పై 21-16, 21-16 స్కోర్ తేడాతో గెలుపొంది ప్రథమ స్థానా న్ని సాధించాడు.
శుక్రవారం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో నాందేడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభినాష్ కుమార్, బ్యాడ్మింటన్ సెక్రటరీ డీపీ సావంత్ల నుంచి బహుమతిని అందుకున్నారు. దీంతో సెప్టెంబర్ నెలలో జరిగే జోవ ల్ స్థాయి పోటీలకు అరత సాధించాడు. అర్జున్ గెలుపు పట్ల తాత, నానమ్మలైన అల్లువెల్లి తిరుపతి రెడ్డి, ప్రేమలతలతో పాటు హైటెక్ సిటీ వాసులు, అతని బంధుమిత్రులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.