03-05-2025 12:34:16 AM
- ఎన్ హెచ్ 163పై అధికారుల నెకట్స్ స్టెప్ ఏంటి?
- మర్రి చెట్లను సంరక్షించాల్సిందేనన్న ఎన్జీటీ
- ఈఐఏ నివేదికలో లోపాలున్నాయని ఆగ్రహం
- ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాలని ఆదేశం
- రోడ్డు కోసం ఉద్యమానికి సిద్ధమవుతున్న ప్రజలు
చేవెళ్ల, మే2: హైదరాబాద్‌బీజాపూర్ జాతీయ రహదారి (ఎన్హెచ్-163) విస్తరణకు బ్రేక్ వేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.
900కు పైగా మర్రి చెట్ల సంరక్షణకు సంబంధించి ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ (ఈఐఏ) నివేదికలో లోపాలు, ప్రజాభిప్రాయ సేకరణ లేకపోవడం, ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయకపోవడం వంటి అంశాలపై ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ ఎస్ ఐ) నివేదిక లేకుండానే ఎక్స్ పర్ట్ అప్రైసల్ కమిటీ (ఈఏసీ) ఈఐఏను ఆమోదించడాన్ని కూడా తప్పుబట్టింది.
సమగ్రంగా అధ్యయనం చేసి రిపో ర్టులు సమర్పించే వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేష నల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏఐ) అధికారుల నెకట్స్ ఏం చేయబోతున్నారనే దానిపై స్థానికుల్లో ఉత్కంఠ నెలకొంది. పాత మార్గం కోసం ఎన్జీటీ ఆదేశాలను పాటిస్తారా, కొత్త అలైన్ మెంట్ కు మొగ్గు చూపుతారా? అని జోరుగా చర్చ జరుగుతోంది. త్వరగా పూర్తయ్యే ఏ మార్గమైనా తమకు సమ్మతమేనని, జాప్యం చేస్తే మాత్రం ఉద్యమం చేస్తామని రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు హెచ్చరిస్తున్నారు.
ఆది నుంచి అడ్డంకులే..
స్టేట్ హైవేగా ఉన్న ఈ రోడ్డును కేంద్రం 2018లో ఎన్హెచ్ 163గా అప్ గ్రేడ్ చేసి రూ. 928.41 కోట్లతో నాలుగు లేన్లుగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ రహదారుల చట్టం1956 కింద 2018 జూలై, 2019 ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
వీటి ప్రకారం సర్వే చేసిన అధికారులు కొత్త అలైన్ మెంట్ కు అవకాశం ఉన్నా.. పాత మార్గాన్ని విస్తరిం చేందుకే మొగ్గు చూపారు. ఈ మార్గంలో 900 మర్రి చెట్లతో పాటు వేల సంఖ్యలో ఇతర చెట్లు పోతుండడంతో 2021లో (ఓఏ 242/2021) ‘సేవ్ బనియన్స్’ సంస్థ ఎన్జీటీలో కేసు వేసింది.
దీంతో టీజీపీఏ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర పనులు ఆగిపోయాయి. 2023లో నవంబర్లో ఎన్జీటీ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వే షించడంతో పాటు ఈఐఏ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఎన్ హెచ్ ఏఐ 2024 జనవరి 2న ఈఐఏ నోటిఫికేషన్ ఇచ్చి.. ఎన్విరాన్ మెంట్ , ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ ద్వారా ఫిబ్రవరి 2న టీఓఆర్ (టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్) పొందింది. దీని ఆధారంగా సైట్ విజిట్ కో సం ఉప-కమిటీ ఏర్పాటైంది. వీళ్లు ఇచ్చిన ఈఐఏ నివేదికను జూన్ 22న ఈఏసీ ఆమోదించగా.. దీన్ని ‘సేవ్ బనియన్’ సంస్థ (ఓఏ 262/2024) ఎన్జీటీలో సవాల్ చేసింది.
ఈఐఏ నివేదికలో లోపాలు
అదనపు భూసేకరణ అవసరం లేనందున పబ్లిక్ హియరింగ్ ను మినహా యించడాన్ని తప్పు పట్టిన ఎన్జీటీ.. భూసేకరణ చేశామని ఎన్హెచ్‌ఏఐ అధికారులే ఒప్పు కున్నారని గుర్తుచేసింది. 900 మర్రి చెట్లలో 522 చెట్లను తరలిస్తామని, బైపాసులు, రోడ్డు వెడల్పు తగ్గించడం ద్వారా 393 చెట్లను కాపాడతామని ఎన్ హెచ్ ఏఐ పేర్కొన్నప్పటికీ.. కేవలం 6 చెట్లు మాత్రమే (30 సెం.మీ. నుంచి 90 సెం.మీ వ్యాసం ఉన్నవి) తరలించడానికి అనువైనవని ‘సేవ్ బనియ న్స్’ సంస్థ వాదనను సమర్థించింది.
అంతేకాదు 5.8 కిలోమీటర్ల మేర దట్టమైన, పురా తన చెట్ల వరుసలు ఉన్నాయని, వీటిని తరలించడం అటవీ మంత్రిత్వ శాఖ మార్గద ర్శకాలకు విరుద్ధమని గుర్తించింది. ఈ ప్రాంతంలో 84కు పైగా పక్షి జాతులు ఉన్నాయని.. పక్షుల గూళ్లు ఉన్న చెట్ల (హెరాన్రీ చెట్లు)ను గుర్తించకపోవడం, జెడ్ ఎస్ ఐ నివేదిక లేకుండానే ఈఏసీ.. ఈఐఏను ఆమో దించడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. ఈఏసీ నివేదికను పబ్లిక్ డొమైన్లో ఉంచకపోవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
కొత్త అలైన్మెంట్ సాధ్యమేనా..?
ఎన్జీటీ 2023లోనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, రోడ్ ట్రాన్స్పోర్ట్ , హైవేస్ మంత్రిత్వ శాఖ 2018 లో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం గ్రీన్ ఫీల్ అలైన్ మెంట్ ను పరిశీలించాలని ఆదేశించింది. అధికారులు దీన్ని ప్రకారం ముందు కు వెళ్లాలనుకుంటే పోలీస్ అకాడమీ నుంచి మొయినాబాద్ వరకు మర్రి చెట్లు లేవు.
మొయినాబాద్ బైపాస్ (భాస్కర్ హాస్పిటల్ నుంచి కనకమామిడి శివారు) చేవెళ్లలో బైపాస్ (కేసారం నుంచి చేవెళ్ల శివారు)తో దాదాపు 350 వరకు చెట్లు సేఫ్ అవుతున్నాయి. కనకమామిడి నుంచి కేసారం వర కు, చేవెళ్లలోని మోడల్ కాలనీ స్టేజీ నుంచి మన్నెగూడ వరకు దాదాపు 522 చెట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములే ఉండడంతో భూసేకరణకు అవకాశం ఉంది.
కేవలం ముడిమ్యాల, కండవా డ పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్ ఉండడంతో ఆ శాఖకు సంబంధించిన పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఫారెస్ట్ లో మర్రి చెట్లతో పాటు ఇతర చెట్లను ఇప్పటికే నోటిఫై చేసిన అధికారులు... చెట్ల తొలగింపు పనులు కూడా చేపట్టారు. దీన్ని ఇంకొంత విస్తరిస్తే సరిపోతోంది. మర్రి చెట్ల మధ్యలో ఉన్న రోడ్డును డబుల్ లేన్గా మార్చి.. చెట్ల అవతలి వైపు ఇంకో డబుల్ లేన్ రోడ్డు వేసే అవకాశం కూడా ఉంది. ఈ పద్ధతిలో భూసేకరణ కూడా పెద్దగా పట్టదు.
పోరాటానికి సిద్ధం
ఈ రోడ్డు కోసం చేవెళ్ల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు పోరుబాటకు సిద్ధం అవుతున్నరు. ఇదివరకే ప్రతిపక్షాల ఆధ్వర్యంలో అనేక సార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేశాం. ఈ సారి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఉద్యమం చేయబోతున్నం. నాలుగు నెలల కింద ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంక్రాంతి తర్వాత ఈ రోడ్డు పనులు ప్రారంభిస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు అడుగు కూడా ముందుకు పడలేదు.
పెద్దొళ్ల ప్రభాకర్, బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు