calender_icon.png 3 May, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని మానవహారం

03-05-2025 12:32:25 AM

ఖమ్మం మే 2 విజయ క్రాంతి: మధ్య భారత దేశంలో ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ లపై జరుగుతున్న నరమేధాన్ని వెంటనే ఆపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జడ్పీ సెంటర్ లో (అంబేద్కర్ చౌరస్తా) వద్ద మానవహారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కాకి భాస్కర్, రవి మారుత్ నిర్వాహకులుగా వ్యవహరించగా , సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాస్ లైన్ జిల్లాకార్యదర్శి గోకనపల్లి వెంకటేశ్వర్లు,

న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, తెలంగాణ పీపుల్స్ జేఏసీ జిల్లా కన్వీనర్ దేవిరెడ్డి విజయ్, జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి చిర్ర రవి,సేవాలాల్ సేన అధ్యక్షులు కిషన్ నాయక్,ఆమ్‌ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు స్వర్ణ సుబ్బారావు, భారత్ బచావో జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్,డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్,ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవిలో ఉన్న ఖనిజ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ పెట్టుబడి దారులకు ఆదాని, అంబానీ ల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆరోపించారు. అందుకు పారా మిలిటరీ బలగాలు, గ్రేహౌండ్స్ దళాలు, సిఆర్పిఎఫ్, బస్తర్ ఫైటర్స్ సి- 60 కమాండోలు సంయుక్తంగా ఆదివాసులపై దాడులు చేస్తూ భయానక వాతావరణాన్ని నెలకొల్పుతున్నారని విమర్శించారు.

దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ బార్డర్ లో లేదా బంగ్లాదేశ్,చైనా సరిహ ద్దుల్లో ఉండాల్సినటువంటి బలగాలని ఈ దేశ పౌరులైనటువంటి ఆదివాసుల పైన దాడులు చేయడం దుర్మార్గమన్నారు. మావోయిస్టు ముక్తభారత్ అని మాట్లాడుతూ మావోయిస్టులను తుద ముట్టించడమే మా లక్ష్యం అని కేంద్ర హోం మం త్రి అమిత్ షా మాట్లాడడం ఆ ప్రజాస్వామికమన్నారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవ హరిస్తూ ప్రజల పైన నరమేధాన్ని ప్రదర్శిస్తున్నా రన్నారు.

ఈ దేశ ప్రజలైనటువంటి ఆదివాసులను నిర్బంధంగా అణిచివేయడం సహించరానిదని దీన్ని  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మన్నారు. మరొక ప్రక్క కాల్పుల విరమణ పాటించండి అని మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసినప్పటికీ, కనీస స్పందన లేకపోవడం నిరం కుశ పాలనకు నిదర్శ మన్నారు. మరొకపక్క మేధావులు,రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ స్పందించకపోవడం సరైన విధానం కాదన్నారు.

ఆదివాసులపై కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి కేంద్ర బలగాలని వెనక్కి పం పాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే విధంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.