27 June, 2026 | 7:45 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ఉల్లాసంగా భద్రాచలంలో ఒలింపిక్ డే రన్

20-06-2025 08:19 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్(District Olympic Association) ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా 18 తారీకు పాల్వంచలో మొదలైన ఒలింపిక్ రన్ నిన్న దమ్మపేట చేరుకుని ఈరోజు ఉదయం 6:30 కి భద్రాచలంలో ఒలింపిక్ జ్యోతిని క్రీడాకారులు ఎమ్మెల్యే శ్రీ తెల్లం వెంకటరావు(MLA Tellam Venkat Rao)కి అందజేశారు. ఈ సందర్భంగా తెల్లం వెంకటరావు మాట్లాడుతూ... భద్రాచలంలో త్వరలో ఒక 400 మీటర్ల అథ్లెటిక్స్ ట్రాక్ కోసం ఐదు ఎకరాలు సేకరించాలని త్వరలో ఆ ట్రాక్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులో తెస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ఐటీడీఏ పిఓ బి రాహుల్ మాట్లాడుతూ... భద్రాచలం పరిసర ప్రాంతంలో గిరిజన క్రీడాకారులు అద్భుతంగా రానిస్తున్నారని వారికి సహకారం ఇవ్వటం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏ ఎస్ పి విక్రమ్ కుమార్ సింగ్ ఐపీఎస్ మాట్లాడుతూ... యువత గంజాయి లాంటి చెడు వ్యసనానికి పోకుండా క్రీడల వైపు మల్లాలి అని భద్రాచలంని గంజాయి రహిత పట్టణంగా మార్చాలని యువతని కోరారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా క్రీడాకారులకు మంచి క్రీడా సదుపాయాలు కలగజేస్తే మంచి అంతర్జాతీయ క్రీడాకారులని అందజేస్తామని తెలిపారు. 

అనంతరం అంబేద్కర్ సెంటర్ నుంచి ఒలింపిక్ డే రన్ నిర్వహించగా సుమారు 200 మంది స్థానిక క్రీడాకారులు చాలా ఉత్సంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ కే మహిధర్, చీఫ్ పాటర్న్ నాగ సీతారాములు, వైస్ ప్రెసిడెంట్ వై వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రెటరీ పి నాగేంద్రబాబు భద్రాచలం కన్వీనర్ గిరి ప్రసాద్ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు దాట్ల రాజు, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ట్రెజరర్ కుంచాల రమేష్, ఉదయ్ కుమార్ జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి రామ్ రెడ్డి, పీడీలు శ్వేత దుర్గారావు, ఎర్రయ్య, తదితరులు పాల్గొన్నారు.