ఆదిలాబాద్‌లో వైభవంగా ఓనం వేడుకలు
అదిలాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): కేరళ తరహాలోనే ఆదిలాబాదు గ్రామీణ మండలం బెల్లూరి అయ్యప్ప ఆలయంలో ఓనం మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం నిర్వహించిన ఓనం వేడుకలకు జిల్లా కలెక్టర్ రాజర్షిషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లు ముఖ్య అతిథులుగా హాజరై పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళలో ఏ విధంగా ఓనం పండుగ జరుగుతుందో, అదే రీతిలో అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోమం, అభిషేకం, దీక్షా కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. 25 సంవత్సరాల నుంచి ఈ గుడిలో ఓనం జరుపుకుంటున్న చరిత్ర కొనసాగుతోందని, దేశవ్యాప్తంగా ఓనం పండుగను జరుపుకున్నట్లే మన జిల్లాలో సైతం జరుపుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు.
ఆలయానికి సంబంధించి గత సంవత్సరంలో ఉన్న పెండింగ్ పేమెంట్స్, బిల్స్ అన్నీ క్లియర్ చేసుకుని, మరిన్ని వసతులు సమకూర్చుకుంటూ ఈసారి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఓనం పండుగను మరింత ఘనంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి రమేష్, గురుస్వాములు గొర్ల కృష్ణ, చంద్ర గణేష్, తిప్పరి సత్యం, గాలి లక్ష్మి, భక్తులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.






