అవినీతికి అంతం లేదా
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పెరిగిన ఏసీబీ కేసులు
పైసలు ఇస్తేనే పని పూర్తి
అధికారుల తీరు నచ్చక ఏసీబీకి పట్టిస్తున్న బాధితులు
నిర్మల్ ఆగస్టు 26 (విజయక్రాంతి): లక్షల్లో జీతం.. లగ్జరీ జీవితం.. అయినా చేయి తడిపితే కానీ పని పూర్తి కావడం లేదు. అవినీతి అక్రమ సంపాదన లక్ష్యంగా ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ అధికారులు రెచ్చిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో ప్రతినెల ఒక శాఖ అధికారి ఏసీబీకి చిక్కి కటకటాల పాలు అవుతున్న మిగతా ఉద్యోగులు భయపడకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ లంచం ఇస్తూనే పని పూర్తి చేస్తామన్న ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.
లంచం ఇవ్వడం, ప్రోత్సహించడం, తీసుకోవడం నేరం అని అవినీతి నిరోధక శాఖ చెప్తున్న జిల్లాలో మాత్రం అధికారుల తీరు మారకపోగా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కేసులు పెరగడం ఆందోళన కలి గించే అంశం. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ని ప్రభుత్వ శాఖ ఏదైనా, శాఖలో పనిచేసే అధికారి ఏ స్థాయి అయినా, ప్రజలు వారి అవసరాల కోసం వస్తే వాటిని ఆసరాగా చేసుకొని డబ్బులు డిమాండ్ చేస్తూ వ్యాపారంగా అధికారాన్ని మార్చుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ దూకు డు పెంచడంతో కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి
మూడేళ్లు.. 51 కేసులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో అవినీతి లంచాన్ని ముట్టుకుంటూ ఏసీబీసీకి చెక్కిన అధికారుల కేసులు గత మూడేళ్లలో ఎక్కువగా ఉన్నాయి. 2023లో 9 కేసులు న మోదు కాగా 2024 లో 12 కేసులు, 2025 లో 24 కేసులు, 2026 లో ఇప్పటివరకు ఏడు కేసులు నమోదు అయ్యాయి.
ఈ కేసుల్లో 65 మందికి పైగా ఏసీబీకి చిక్కినట్టు అధికారులు చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా మున్సిపల్ రెవెన్యూ వ్యవసాయ శాఖ వాణిజ్య పనుల శాఖ ఆర్టిఓ సబ్ రిజిస్టర్ గ్రామ పరిపాలన అటవీ శాఖ భూ కొలతలు శాఖలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆయా శాఖలో జిల్లా అధికారితో మొదలుకొని జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసి స్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయి సిబ్బంది లంచాలను డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొందరు అధికారులు పదవీ విరమణకు దగ్గర ఉన్న లంచం తీసుకుంటూ చిక్కా రు. కొందరు ఉద్యోగంలో చేరిన రెండేళ్లకి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపట్టారు. ఈ కేసులు రెవెన్యూ మున్సిపల్ పోలీస్ శాఖ లోనే ఎక్కువ నమోదు అవుతున్నాయని చెప్తున్నారు. అవినీతి లంచం వ్యతిరేకంగా ఆయా ప్రభుత్వ కార్యాలయంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసిన అధికారులు మీడియేటర్లను పెట్టుకొని థర్డ్ పార్టీ ప్రోత్సా హంతో ప్రైవేట్ వ్యక్తుల సాయంతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు చెప్తున్నారు
ప్రజల్లో పెరిగిన చైతన్యం
ఉమ్మడి అదిలాబాద్ అవినీతిని అంత ముందుంచేందుకు అవినీతి నిరోధక శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. సోషల్ మీడియాతో పాటు కరపత్రాలు ప్రభుత్వ కార్యాల యంలో ఏసీబీ అధికారుల ఫోన్ నెంబర్లు, టోల్ ఫ్రీ నెంబర్, ఏసీబీని ఆశ్రయించిన బాధితుల వివరాలను గోప్యంగా ఉంచడం వంటి చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు, ప్రభుత్వ శాఖ అధికారి హోదా ఏదైనా లంచం ఇవ్వడం ఎంత నేరము లంచంకు ప్రోత్సహించడం అంత నేరమని ప్రచారం చేస్తున్నారు.
అయినప్పటికీ కొంద రు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజా అవసరాల కోసం వచ్చిన అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని పనికి ఒక రేటు అనే విధంగా లంచం డిమాండ్ చేస్తూ పట్టుబడుతున్నారు. ఒక జిల్లా స్థాయి అధికారి కేవలం 3000 లంచం తీసుకుంటూ తన ఉద్యోగాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిం ది. అటవీ శాఖలో పని చేస్తున్న కొత్త ఉద్యోగి 6వేల కోసం ఏసీబీకి చిక్కారు. మామడ మండలంలో మూడుసార్లు పోలీసులు ఏసీబీకి చిక్కారు. 2000 నుంచి 50000 డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు అధికారి వద్దకు వచ్చినప్పుడు పనిచేసి పెడితే గౌరవంగా ఎంతో కొంత అధికారులకు ఇవ్వడం సర్వసాధారణం.
కానీ అధికారులు మాత్రం ఈ పనికి ఇంత అన్నట్టు లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కుతున్న జిల్లా జిల్లా అధికారులు మాత్రం మార్పు రావడం లేదు. ఏసీబీ దాడులు చేసి కేసులు పెడుతున్న భయం లేదన్నట్టు కొందరు అధికారులు ఇంకా అక్రమాలకు పాల్పడడం ప్రజల్లో చర్చనీయ అంశంగా మారింది. జిల్లా పరిపాలన పర్యవేక్షణ కరువు కావడం, ఎందుకు నిదర్శనం. లంచాలకు పట్టుపడ్డ వారిని కేసులు నమోదు చేసుకొని జైల్లోకి పంపిస్తున్న ఉమ్మడి జిల్లాలో మాత్రం లంచ అవతారాలు ఎక్కడో ఒకచోట మళ్లీ ఏసీబీకి చిక్కడం సర్వసాధారణంగా మారిపోయింది
ప్రజల్లో చైతన్యం పెరిగింది
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి నీ అంతం చేసేందుకు ఏసీబీ ప్రజల్లో చైతన్యం తెచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచింది. లంచం ఇవ్వడం తీసుకోవడం నేరంగా పరిగణించబడుతుంది. ఎవరైనా లంచాన్ని అడిగిన ప్రోత్సహించిన ఏసీబీ నీ ఆశ్రయించాలి, ఎందుకు 94404461 16 నంబర్ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
ఏసీబీ డీఎస్పీ మధు






