calender_icon.png 14 August, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓనమ్ లిరికల్ సాంగ్ వచ్చింది

10-08-2025 01:01:07 AM

యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కే రాంప్’ (K Ramp). జైన్స్ నాని దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.

మలయాళ బ్యూటీ యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. అక్టోబర్ 18న దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ‘ఓనమ్’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ రాయగా, ఎనర్జిటిక్ ట్యూన్ తో కంపోజ్ చేసి సాహితీ చాగంటితో కలిసి పాడారు.

కేరళ పండుగ ఓనమ్ సందడి అంతా ఈ పాటలో కనిపించింది. ’ఓనమ్’ పాటలో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ యుక్తి తరేజా మాస్ స్టెప్స్ స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి.  లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకి చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.