calender_icon.png 14 August, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షరతులతో వేతనాల పెంపునకు నిర్మాతలు ఓకే

10-08-2025 01:02:44 AM

గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న కార్మికుల వేతనాల పెంపు అంశం ఓ కొలిక్కి వచ్చింది. షర తుల మేరకు సినీ కార్మికుల వేతనాలను పెంచేందుకు సుముఖంగా ఉన్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఈ మేరకు శనివారం సుదీర్ఘ చర్చల అనంతరం విలేకరులతో మాట్లాడారు.

వేతనాల పెంపుపై తమ అభిప్రాయాన్ని వెల్లడించా రు. మొత్తం మూడు విడతలుగా వేత నాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలి పారు. వేతనాల పెంపుపై నిర్మాతలు తీసుకున్న నిర్ణయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ తెలియ జేస్తూ.. ‘వారం రోజులుగా జరిగిన మంత నాలు కొలిక్కి వచ్చాయి. రోజుకు రూ.2 వేల కన్నా తక్కువ తీసుకుంటున్న వారికి వేతనాలు పెంచాలని నిర్ణయించాం. మొదటి సంవత్సరం 15 శాతం, రెండో సంవత్సరం 5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంచుతాం.

రూ.1000 కంటే తక్కువ వేతనం ఉన్న వాళ్లకు నేరుగా 20 శాతం వెంటనే పెంచుతాం. రెండో సంవత్సరం ఎలాంటి పెంపూ ఉండదు. మూడో ఏడాది మరో 5 శాతం పెంచుతాం. బడ్జెట్ పరంగా చిన్న సినిమాలకు పాత వేతనాలే కొనసా గుతాయి. మేం వారి ముందు నాలుగు షరతులు పెట్టాం. అవి ఒప్పుకొంటే ఈ పెంపు వెంటనే అమలవుతుంది.

చిన్న సినిమా అంటే ఎంత బడ్జెట్ అనే దానిపై పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. అందరూ కలిసి చర్చించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి. అర్హత కలిగిన కార్మికులకు తగిన వేతనం ఇవ్వాలన్నదే మా అభిప్రాయం. ప్రస్తుతం రోజుకు నాలుగైదు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి వేతనాలు పెంచమనడం సరికాదు‘ అని అన్నారు.

మేం అంగీకరించం: ఫెడరేషన్ నేతలు..

మరోవైపు నిర్మాతలతో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల చర్చలు విఫలమయ్యాయి. వేతనాల పెంపు విషయంలో నిర్మాతల నిర్ణయాన్ని అంగీకరించేదిలేదని ఫెడరేష న్ నేతలు తేల్చి చెప్పారు. నిర్మాతలు విధించిన షరతులకు ఒప్పుకొనేది లేద న్నారు. ఫెడరేషన్ను విభజించేలా, యూని యన్ల ఐక్యతను దెబ్బతీసేలా నిర్మాతల నిర్ణయాలు ఉన్నాయని ఆరోపించారు. రోజువారీ వేతనాలు తీసుకునే 13 సంఘాలకు ఒకే విధంగా పెంచాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం నుంచి తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.