calender_icon.png 13 August, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుపమ 2.0 చూడబోతున్నాం

10-08-2025 12:59:55 AM

మలయాళ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఈ సినిమా థియేట్రికల్  ట్రైలర్‌ను శనివారం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లాంచ్ చేశారు. ఆనంద మీడియా బ్యానర్‌పై  శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

సినిమా అంతా గ్రామీణ నేపథ్యం, సాహస యాత్ర చుట్టూనే తిరుగుతుంది. ట్రైలర్ లో విజువల్స్ ఆకట్టుకున్నాయి. అనుపమ నటన నేచురల్‌గా ఉంది.  రామ్ పోతినేని మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో లాపతలేడీస్ లాంటి సినిమాలు చూస్తుంటాం. మనం ఎందుకు అలాంటి సినిమాలు చేయలేమని ఆలోచిస్తుంటాం.   ‘పరదా’ స్టోరీ లైన్ నాకు తెలుసు.

అనుపమ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందని, ఖచ్చితంగా ఇలాంటి సినిమాలను మనం ఎంకరేజ్ చేసి, నిర్మాతల్ని తప్పకుండా ప్రోత్సహించాలన్నారు. హీరోయిన్ అనుపమ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా అందరూ థియేటర్స్‌లో చూడాలన్నారు.

డైరెక్టర్ ప్రవీణ్, ప్రొడ్యూసర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో అనుపమ 2.0 చూడబోతున్నామని, ఈ సినిమా రివ్యూ బాగుంటేనే సినిమా చూడండి’ అన్నారు. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ దర్శన రాజేంద్రన్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 22న తెలుగు, మలయాళంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.