23-01-2026 12:00:00 AM
నరేశ్ అగస్త్య, సంజనా సారథి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ఫీల్ గుడ్ రొ మాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ‘మరొక్కసారి’. నితిన్ లింగుట్ల రచన, దర్శతక్వం వహిస్తు న్న ఈ సినిమాను సీకే ఫిల్మ్ మేక ర్స్ బ్యానర్‌పై బీ చంద్రకాంత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. బ్రహ్మాజీ, సుదర్శన్, వెంకట్, వెంకట్ కాకమాను, దివ్యవాణి తదితరులు ఇందులో ముఖ్య తారాగణంగా ఉన్నారు. ఇప్పటికే షూ టింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ చిత్రాన్ని రొటీన్ సినిమా మేకింగ్ సరిహద్దులను దాటి ఛాలెంజింగ్‌గా రూపొందించామని మేకర్స్ తెలియజేశారు. ముఖ్యంగా టిబెట్ సరిహద్దు భూమికి సమీపంలో ఉన్న అత్యంత ఎత్తయిన ప్రాంతంలోని గురుడోంగ్మార్ సరస్సు వద్ద ఈ సినిమాను షూట్ చేశామని టీమ్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సరస్సుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన గురుడోంగ్మార్ వద్ద చిత్రీకరించిన తొలి భారతీయ సినిమాగా ‘మరొక్కసారి’ నిలిచింది.
ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత బీ చంద్రకాత్‌రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భరత్ మాంచిరాజు; ఛాయాగ్రహణం: రోహిత్ బచు; ఎడిటర్: చోటా కే ప్రసాద్; ప్రొడక్షన్ డిజైన్: రవికుమార్ చలమటికారి.