calender_icon.png 24 January, 2026 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్కార్ బరిలో సిన్నర్స్‌కు నామినేషన్లు 16

23-01-2026 12:00:00 AM

‘ఆస్కార్ అవార్డులు-2026’కు సంబంధించి నామినేషన్ల జాబితా వెలువడింది. పోటీలో ఉన్న సినిమాల జాబితాను అకాడమీ గురువారం ప్రకటించింది. 2025లో విడుదలై వివిధ విభాగాల్లో అద్భుత ప్రతిభను కనబరిచిన చిత్రాలు షార్ట్ లిస్ట్ అయి అకాడమీ ముందుకు రాగా, వాటిలో ఉత్తమ చిత్రం కేటగిరిలో అత్యధికంగా 10 సినిమాలు బరిలో నిలువడం విశేషం. రేయాన్ కూగ్లర్ దర్శకత్వంలో రూపొందిన ‘సిన్నర్స్’ అత్యధికంగా 16 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఇప్పటివరకూ 14 నామినేషన్లు దక్కించుకున్న సినిమాలుగా ‘ఆల్ అబౌట్ ఈవ్’, ‘టైటానిక్, ‘లా లా ల్యాండ్’ ఉండేవి.

‘సిన్నర్స్’ ఆ రికార్డును బద్ధలుకొట్టింది. ఈ చిత్రం తర్వాత ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదరు’ సినిమాకు ఎక్కువ నామినేషన్లు దక్కాయి. క్యాస్టింగ్ డైరెక్టర్ కేటగిరిని ఈ ఏడాది కొత్తగా అవార్డుల విభాగంలో చేర్చారు. ‘సిన్నర్స్’లో నటనకు గానూ 73 ఏళ్ల డెల్రోయ్ లిండో తొలిసారి ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్స్ ప్రకటన కార్యక్రమానికి నటుడు డానియల్ బ్రూక్స్, లూయిస్ పుల్మన్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 15న జరగనుంది.