పార్కు స్థలాన్ని కబళిస్తున్న ఆలయ ట్రస్టీ
- వనస్థలిపురం ఫేజ్ - కాలనీలో పార్కు
- అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆలయ కమిటీ సభ్యులు
- చైతన్య మహిళా మండలి అధ్యక్షురాలు ఆశాజ్యోతి
- 50 ఏళ్లుగా పార్కు అభివృద్ధికి పోరు సాగిస్తున్న మహిళలు, సీనియర్ సిటిజన్స్
ఎల్బీనగర్, జూన్ 19 : వనస్థలిపురం ఫేజ్- కాలనీలో నిరుపయోగంగా ఉన్న పార్కును స్థానికంగా ఉన్న ఆలయ ట్రస్టీ సభ్యులు ఆక్రమించడానికి కుట్ర చేస్తున్నారని చైతన్య మహిళా మండలి అధ్యక్షురాలు ఆశాజ్యోతి ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం చైతన్య మహిళా మండలి సభ్యులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశాజ్యోతి మాట్లాడుతూ... వనస్థలిపురంలో పార్కులు అభివృద్ధికి ప్ర భుత్వం నిధులు మంజూరు చేసినా.. కొం దరి కుట్రల కారణంతో పార్కు అభివృద్ధికి నిధులు మంజూరు కాలేదన్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో వనస్థలి పురం ఫేజ్ - 1 కాలనీలో శివాలయం దగ్గర ఉన్న పార్కు నిరుపయోగంగా మారి, వ్యర్థాలను నిల్వ చేసే డంపింగ్ యార్డుగా మారిం దన్నారు. 1977లో కాలనీ ఏర్పడినప్పుడు ఏర్పాటు చేసిన పార్కును అప్పటి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కోటాలో వచ్చిన నిధులతో 2000లో పార్కును అభివృద్ధి చేసి, చైతన్య మహిళా మండలి పేరుతో ప్రత్యేకంగా కమ్యూనిటీ హాలు, గ్రంథాలయం కోసం ఉమ్మడిగా ప్రత్యేక భవనం నిర్మించారని చెప్పారు.
స్థానిక మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ కోసం 2012లో అప్పటి వనస్థలిపురం కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రా మ్మోహన్ ప్రత్యేక కృషితో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారని, ఇందులో మహిళలు చదువుకోవడానికి గ్రంథాలయంతో పాటు ఉపాధి కల్పించడానికి కుట్టు, అల్లికలకు శిక్ష ణ ఇవ్వడానికి ప్రత్యేక భవనం నిర్మించారని వివరించారు. కానీ, పార్కు ఇప్పుడు అనాథ మారి, నిరుపయోగంగా ఉండి, డంపింగ్ యార్డుగా మారిందని ఆరోపించారు.
పార్కులో పచ్చదనం పెంచి, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి, మహిళల కోసం నిర్మించిన భవనాన్ని వినియోగంలోకి తేవాలని చైతన్య మహిళా మండలి సభ్యులు కోరుతున్నారు. లక్షల రూపాయలతో నిర్మించిన చైతన్య మహిళా మండలి భవనం వృథాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వనస్థలిపురం ఫేజ్ - లోని చైతన్య మహిళా మండ లి పార్కులో పచ్చదనం పెంచి, వృద్ధుల కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు.
కాగా, పార్కు పక్కన ఉన్న శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి ఆలయ సంస్థానం ప్రతినిధులు పార్కును ఆలయ నిధులతో అభివృద్ధి చేస్తామని పార్కును ఆక్రమించడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పార్కు పరిరక్షణ, గ్రంథాలయ పునరుద్ధరణను జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని చైతన్య మహిళా మండలి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీనియర్ సిటిజన్స్, చైతన్య మహిళా మండలి సభ్యులు డి.రజిని, పి.కవిత, పి.అనిత, కె.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.






