calender_icon.png 16 July, 2025 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం

16-07-2025 01:14:46 AM

డీఎస్పీకే శివరాం రెడ్డి  

నల్లగొండ టౌన్, జూలై 15 : గ్రామంలో ఎటువంటి నేరాలు, దొంగతనాలు జరగకుండా , ఏదైనా నేరం జరిగిన కూడా సిసి కెమరాల ద్వారా నిందితులను గుర్తించుటకు అవకాశం ఉంటుంద ని ఒక సిసి కెమెరా 100 మంది పోలీసుల తో సమానంగా పని చేస్తుందని నల్లగొండ డిఎస్పీకే శివరామిరెడ్డి  తెలిపారు. మంగళవారం నల్లగొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పోలీసుల సూచన మేరకు దాతల సహాయంతో ఏర్పాటుచేసిన  ఏడు సీసీ కెమెరాల ఏర్పాటును ప్రారంభించి మాట్లాడారు. సీసీ కెమెరాలు ప్రోత్సహించిన   రాజలింగం,అజయ్, మాజీ సర్పంచ్ నాగయ్య గ్రామ   పోలీస్ అధికారి శంకర్ గ నల్గొండ రూరల్ ఎస్‌ఐ సైదా బాబు లను డీఎస్పీ అభినందించారు.