16-07-2025 01:13:18 AM
సూర్యాపేట, జూలై 15 (విజయక్రాంతి) : సూర్యాపేటలోని మీనీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఐదు ఎకరాల భూమిలో పార్క్ ఏర్పాటుకు స్థలంను మంగళవారం తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రముఖ ఆర్టిటెక్చర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు సుమారు రూ.10 కోట్లతో టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేయనున్నామన్నారు.
సూర్యాపేటను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు గాను 4,5 ప్రధాన ప్రాంతాల్లో ఆకర్షణీయమైన పెయింటింగ్స్తో కూడిన సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేను యొక్క తెలిపారు. త్వరలో నిధులు కేటాయించి, రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగిన పార్క్ను సూర్యాపేటలో అభివృద్ధి చేస్తామన్నారు. పిల్లల కోసం ఆటస్థలాలు, పాఠశాల విద్యార్థులకు చదివే చోటుగా బెంచ్లు, అలాగే ఫుడ్ కోర్ట్ వంటి సౌకర్యాలతో కూడిన పూర్తి వినోద ప్రదేశంగా ఈ పార్క్ను తీర్చిదిద్దుతామన్నారు. ఈయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.