16-07-2025 01:15:08 AM
లేదంటే కర్ణాటక సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తాం
మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, తలసాని
ఇందిరాపార్క్ వద్ద బీసీటీఎఫ్ ఆధ్వర్యంలో మహాధర్నా
ముషీరాబాద్, జూలై 15: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కాకుంటే రాష్ట్రం లో భూకంపం సృష్టిస్తామని మాజీ మంత్రు లు, బీఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం కోటాకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు, బీఆర్‌ఎస్ నేతల ఆధ్వర్యంలో బీసీ తెలంగాణ ఫోర్స్ (బీసీటీఎఫ్) రాష్ర్ట అధ్యక్షుడు కుమార్ నేతృత్వంలో మంగళవారం ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లా డుతూ.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో బీసీ డిక్లరేషన్ చేయించారని గుర్తు చేశారు. రిజర్వేషన్లు అమలుకాకుంటే వేలాది మందితో కర్ణాటకకు వెళ్లి అయన ఇంటి ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. జీవోతో రిజర్వేషన్లు అమలవుతా యంటే ఇన్నాళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఇతర రాష్ట్రాలు కూడా జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్ అమలు చేసేవి కదా అని నిలదీశారు. బీసీలను జీవో పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్వా తంత్య్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు కాం గ్రెస్ అతిపెద్ద ద్రోహం చేసిందని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి అదే బాటలో నడుస్తూ నయవంచనకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలంటే అడుక్కునేవారు కాదని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
రిజర్వేషన్లు ఇవ్వకుంటే పోరాడి గుంజుకుంటామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్‌లో 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన కాంగ్రెస్.. తప్పుల తడకగా కులగణన లెక్కలు చేసి హడావుడిగా అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపిందని ఆరోపించారు. రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కోసం కాంగ్రె స్.. కేంద్రంపై ఒత్తిడి తేలేదని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నదన్నారు. 42 శాతం బిల్లుకు చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. బీసీలు యాచకులు కాదని, రిజర్వేషన్ తమ హక్కు అని చెప్పారు. బీసీలను మోసం చేయాలని చూస్తే భూకంపం సృష్టిస్తామని హెచ్చరించారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ..
తమిళనాడు తరహాలో తొ మ్మిదో షెడ్యూల్‌లో చేరిస్తే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత రాదన్నారని, బీసీలు సంఘటి తమై హక్కుల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు. మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. నమ్మకద్రోహం, మోసానికి సీఎం రేవంత్‌రెడ్డి మారు పేరని నిప్పులు చెరిగారు. 66 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, కులగణన చేపట్టకుండా, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకుండా బలహీనవర్గాలను దగా చేసిందన్నారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్‌లో తప్పుడు హామీలిచ్చి గద్దెనె క్కిన కాంగ్రెస్, ఇప్పుడు రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా ఆర్డినెన్స్‌ల పేరుతో డ్రా మాలు ఆడుతోందని విమర్శించారు. మాజీ మం త్రులు గంగుల కమలాకర్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, రసమయి బాలకిషన్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభర ణం కృష్ణమోహన్‌రావు,
పుట్ట మధు, నాయకులు సాయి కృష్ణ యాదవ్, ముఠా జైసిం హ, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, తుల ఉమ, ప్రొఫెసర్ చిరంజీవులు ప్రసంగిస్తూ.. ప్రభుత్వం వెంటనే 42 శాతం కోటాకు చట్టబద్ధత కల్పించాలని, లేదంటే రాష్ర్టవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.