02-08-2025 02:13:14 AM
ఏసీపి రాజా వెంకటరెడ్డి
నిజామాబాద్ ఆగస్టు 1:(విజయ క్రాంతి): నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ ఎక్స్ రోడ్, బైపాస్ కాజా హోటల్ చౌరస్తా లో శుక్రవారం 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించడానికి నగర ఏసిపి రాజా వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సరి సమానమని ఇందుకు ప్రజలు తమ వంతు బాధ్యతగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు.
రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆరిఫ్, సిఐ సురేష్ ప్రత్యేక శ్రద్ధతో తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈరోజు స్థానిక రూరల్ ఎస్త్స్ర ముందుకు వచ్చి ఎనిమిది సీసీ కెమెరాలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతిక్షణం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ సీసీ కెమెరాలు నిఘా పోలీస్ లకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
స్థానికుల సహకారం లేనిదే ఏమీ చేయలేమని గ్రహించిన బైపాస్ రోడ్ ఖాజా హోటల్ చౌరస్తాలోని శ్రీ జగదాంబ హోటల్ నిర్వాహకుడు రాథోడ్ సంజయ్ సొంత ఖర్చులతో ఒక సీసీ కెమెరాను పోలీస్ డిపార్ట్మెంట్కు ఇవ్వడం అభినందనీయ మన్నారు. అలాగే ప్రమాదాల నివారణ కోసం సమాజంలో సమాజ బాధ్యత గల ఓ పౌరునిగా శిశు కెమెరాలు సర్వీసింగ్ ఏర్పాటు చేసే నరేష్ ఇందులో ముందుకు వచ్చి ఆయా ప్రదేశాల్లో సీసీ కెమెరాలు బిగించడం అభినందనీయమన్నారు.