02-08-2025 02:15:26 AM
బ్లూక్రాస్ ఆఫ్ హైదరాబాద్ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల
ముషీరాబాద్, ఆగస్టు 1 (విజయ క్రాంతి) : వీధి కుక్కలు, పిల్లుల కోసం మొబైల్ షెల్టర్లను ఏర్పాటుకు పా ప్రొటెక్ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని ప్రముఖ నటి, జంతు సంక్షేమ ఉద్యమకారిణి, బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల అన్నారు.
దేశమంతటా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వీధి కుక్కల కు రక్షణ కల్పించేందుకు మార్స్ పెట్కేర్, ఇ న్స్టామార్ట్ కలిసి సంయుక్తంగా పా ప్రొటెక్ను హైదరాబాద్కు విస్తరించడం పట్ల శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని నగరాల్లో కూడా ఈ తరహా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దేశ వ్యాప్తంగా 700 షెల్టర్లను ప్రారంభించినట్లు మార్స్ పెట్ కేర్ ఇండి యా ఎండీ సలిల్ మూర్తి, స్విగ్గీ ఇన్స్టామార్ట్ వైస్ ప్రెసిడెంట్ అర్జున్ చౌధరి తెలిపారు.