02-08-2025 02:12:29 AM
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): జర్నలిస్టులను చెంప చెల్లుమ నాలనిపిస్తోందంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తీ వ్రంగా విమర్శించారు. ఇదేనా మీ వైఖ రి అంటూ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చే శారు. ఓ ప్రజాప్రతినిధి, సీఎం స్థాయి లో ఉన్న వ్యక్తి మాట్లాడే భాష ఇలా ఉండొద్దని ఆయన ఎక్స్ వేదికగా సూచించారు.
భౌతిక దాడికి దిగాలనిపిస్తోందని ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం అవమానకరమన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా గుర్తింపుపొందిన పాత్రికేయులపై పరుషంగా మాట్లాడటం చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అవగతమవుతుందన్నారు. ఇంకా ఈ కర్కశ కాంగ్రెస్ నేతల టార్గెట్ లిస్టులో ఇంకెందరు ఉన్నారో అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.