01-11-2025 05:59:49 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య(45) అనే వ్యక్తి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తాడువాయి ఎస్సై నరేష్ తెలిపారు. గ్రామానికి చెందిన మల్లయ్య అప్పల బాధలు తట్టుకోలేక మనస్థాపానికి గురయ్యారు. బుధవారం తన పొలం వద్దకు వెళ్లి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆయనను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్సల కోసం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన ఆరోగ్యం క్షీణించి శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. ఈ విషయమై భార్య రాజవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.