11 April, 2026 | 3:51 PM

Breaking News

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •  

క్రీడా నైపుణ్యంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి

06-02-2026 01:04 AM
  1. గ్రామస్థాయిలో ఉన్న క్రీడాకారులకు సీఎం కప్పు ప్రత్యేక వేదిక

తెలంగాణ స్పోరట్స్ అథారిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి

వనపర్తి, ఫిబ్రవరి 5 ( విజయక్రాంతి ) :రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ రెండవ ఎడిషన్ లో భాగంగా గురువారం గోపాల్ పేట మండలం లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి క్రీడోత్సవాలను నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులతో కలిసి సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వల చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ... పూర్వం రోజుల్లో క్రీడలకు అంతగా ప్రాధాన్యత ఉండేది కాదని, గ్రామీణ ప్రాంతంలో ఆటలాడుదాం అనుకున్న మైదానాలు ఉండే వి కావని, రేవంత్ రెడ్డి సర్కార్ లో ప్రజా పాలన ప్రభుత్వం వచ్చాక సీఎం కప్పు మొ దటి ఎడిషన్, రెండవ ఎడిషన్ ద్వారా లక్షల్లో విద్యార్థులు పాల్గొని క్రీడా స్ఫూర్తిని ఘనపరుస్తున్నారన్నారు.

జీవితంలో ఓడిపోతే చెడి పోయినట్లు కాదని, ఓటమి అనేది గెలుపు కోసం నిరంతరం శ్రమించే యోధులుగా చరిత్రలో నిలుస్తారని అన్నారు. గ్రామస్థాయిలో ప్రతిభ ఘనపరిచిన క్రీడాకారులను వారి నైపుణ్యతను బట్టి అకాడమీలో చేర్పిం చి ప్రత్యేక శిక్షణ ఇప్పించి జాతీయస్థాయిలో రాణించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో క్రీడా మై దానాలను అందుబాటులో ఉంచే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు.

యువత ఎలాంటి చెడు వ్యసనాలకు వెళ్ళొద్దని ప్రజా ప్రభుత్వం యువత కోసం మానసిక ఉల్లా సం, క్రీడా దృఢత్వం , క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యం వెలికి తీసేందుకు సీఎం కప్పు మొదటి ఎడిషన్, రెండవ ఎడిషన్ వంటి కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. గత ప్రభుత్వా హాయంలో క్రీడారంగానికి 10 ఏళ్ల కాలంలో రూ 350 కోట్లు కేటాయించి, క్రీడాలను, క్రీడాకారులను, విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు.

రేవంత్ రెడ్డి సర్కార్ లో రెండేళ్ల కాలం వ్యవధిలో రూ 850 కోట్లు కేటాయిస్తూ.. క్రీడాకారుల కోసం ఉన్న పాత జీవోలను మారుస్తూ... కొత్త పాలసీలను తెచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. దీప్తి జివాంజి వంటి క్రీడాకారిణి నిరుపేద కుటుంబంలో పుట్టి పారీస్ పారా ఒలంపిక్ లో కాంస్యం పథకం సాధించే విషయాన్ని గుర్తు చేశారు .

అలాగే దీప్తి జివాంజి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయలు నజరాన ఇచ్చిన విషయం గూర్చి విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ కుమార్, డీఈవో అబ్దుల్ గని, సురేందర్ రెడ్డి, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.