13 August, 2026 | 4:30 AM

సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై అప్రమత్తంగా ఉండాలి

13-08-2026 02:01 AM

సీఐ మహేందర్ రెడ్డి 

ఇబ్రహీంపట్నం, ఆగష్టు 12(విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో ని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో  సైబర్ నేరాలు, యాంటీ ర్యాగి్ంప  బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ సీపీ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎస్ హెచ్ ఓ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. అలాగే ర్యాగింగ్కు పాల్పడితే తీవ్ర చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులు లేదా ప్రశాంతతకు విఘాతం కలిగించే సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ సదస్సులో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.