21-08-2025 07:31:38 PM
జిల్లా మిషన్ కోఆర్డినేటర్ యశోద..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): విద్యార్థి దశ నుండే అన్ని చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా మిషన్ కోఆర్డినేటర్ యశోద(District Mission Coordinator Yashoda) అన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, DHEW బృందం ఆధ్వర్యంలో బేలా మండలంలోని సిర్సన్న ప్రభుత్వ పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోక్సో చట్టం, బాల్య వివాహ నిషేధ చట్టం, లింగ సమానత్వం అంశాలపై జిల్లా మిషన్ కోఆర్డినేటర్ యశోద విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం, విద్యార్థులతో కలిసి మొక్కల నాటారు. బేటీ బచావో- బేటీ పడావో క్యాంపైన్‌లో భాగంగా సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో DHEW టీమ్ సభ్యులు కృష్ణవేణి, కోటేశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.