17 April, 2026 | 11:51 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కఠోర సాధనతో లక్ష్యం వైపు ప్రయాణించాలి

16-05-2025 12:00 AM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఆదిలాబాద్, మే 15 (విజయ క్రాంతి) : లక్ష్య సాధన కోసం కఠోర శ్రమ చేస్తూ, ఉన్నత లక్ష్యాల వైపు ప్రయాణించాలని ఖా నాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఉట్నూర్ మం డల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ మైదానంలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిభిరాలు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ... చదువుతోనే మన తలరాతలు మారుతాయని, ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదువుకొవాలని సూచించారు. క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలన్నారు. గొప్ప లక్ష్యాలను పెట్టుకొని లక్ష్య సాధన కోసం కృషి చేయాలని సూచించారు. చదువుకునే విద్యార్థులకు తనవంతు సహాయ సహకారాలు అందించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు.

అనంతరం హార్టికల్చర్ ద్వారా మామిడి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిడి అంబాజీ, ఏపీఓ (పివిటిజీ) మెస్రం మనోహర్, పీజీ హెచ్‌ఎం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భాస్కర్, జిల్లా గిరిజన క్రీడా అధికారి పార్థసారథి, పిడిలు, కోచ్ లు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.