16-05-2025 12:00:00 AM
సంగారెడ్డి, మే 15(విజయక్రాంతి):కాంగ్రెస్ పార్టీలో కమిటీల సందడి మొదలైంది. గత అనుభవాల నేపథ్యంలో కొత్త టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ క్షేత్ర స్థాయి లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించగా.. ఇందుకో సం జిల్లాలకు నియమించిన పరిశీలకులు వారం రోజులుగా జిల్లాలో పర్యటించి కమిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తు న్నారు.
సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని గ్రామ స్థాయి నుంచి బ్లాక్ స్థాయివరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నూతన కమిటీల ఏ ర్పాటు ప్రక్రియ వారం రోజులుగా సాగుతోంది. ఆయా జిల్లాల పరిశీలకులు వరప్ర సాద్, మెట్టు సాయికుమార్, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి మండలాల్లో పర్యటించి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఇలా రెండు జిల్లాలలోని ఆయా ని యోజకవర్గాలు, మున్సిపాలిటీల పరిధిలో కమిటీల నియామకం కోసం దరఖాస్తులు తీ సుకుంటున్నారు. ఆయా మండలాల్లో గ్రా మ, మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల కోసం పోటాపోటీగా దరఖాస్తులు చేసుకున్నారు.
గాడ్ ఫాదర్లను నమ్ముకొని..
పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న నా యకులు ఎవరికి వారుగా తమకే పదవి వ స్తుందని చెబుతున్నారు. ప్రధానంగా మెదక్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వర్గీయులు ఎవరికి వారే పోటీ పడుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ వర్గీయులు పదవులను ఆశిస్తున్నప్పటికీ ఇక్కడ కూడా మైనంపల్లి హన్మంతరావు ఆశీస్సులు ఎవరికి ఉంటా యో వారికే పదవులు దక్కే అవకాశం ఉంది.
సంగారెడ్డి నియోజకవర్గంలో ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ్మ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వర్గీయులు పోటీపడుతున్నారు. తమ వర్గానికి చెందిన వారికే పదవులు దక్కుతాయని ఎవరికి వా రు ధీమాగా ఉన్నారు. ఆందోల్ నియోజక వర్గంలో మంత్రి దామోదర రాజనర్సింహ్మ అనుచరులకే పదవులు దక్కనున్నాయి. నారాయణఖేడ్లో నియోజకవర్గంలో జహీరాబాద్ ఎంపీ సురేష్శెట్కార్, ఎమ్మెల్యే సంజీవ రెడ్డి వర్గీయుల మధ్య గట్టి పోటీ నెలకొంది.
పటాన్చెరు నియోజకవర్గంలో ఓవైపు నీలం మధు వర్గీయులు, మరోవైపు కాట శ్రీనివాస్గౌడ్ వర్గీయులు తమకంటే తమకు అవకా శం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నప్పటికీ తాను బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వాడి నేనని స్పష్టం చేయడంతో ఆయన అనుచరులు అయోమయానికి గురవుతున్నారు.
అలాగే జహీరాబాద్ నియోజకవర్గంలో ఎంపీ సురేష్శెట్కార్ వర్గీయులకు పదవులు దక్కను న్నాయి. ఇలా దరఖాస్తు చేసుకున్న వారు మేం కేవలం దరఖాస్తు చేసే వరకే.. అంతా మా నాయకులు చూసుకుంటారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గత అనుభవాల దృష్టిలో పెట్టుకొని...
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు పలు మండలాల్లో రసాభాసగా మారింది. ఆయా నియోజకవర్గాల్లో గ్రూపు విబేధాల వల్ల పలు విమర్శ లు చేసుకున్నారు. మరికొన్ని మండలాల్లో పాత కార్యకర్తలను కా కుండా ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఫిర్యాదులు పీసీసీ వరకు వెళ్లాయి.
ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పకడ్బందీగా నియామక ప్రక్రియ ఉంటుందని జిల్లాలకు వచ్చిన పరిశీలకులు చెబుతున్నారు. వచ్చిన దరఖాస్తు లు పరిశీలించి గ్రామ స్థాయి నుంచి ఫీడ్‌బ్యా క్ తీసుకుంటామని, పీసీసీ అ ధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సమక్షంలో నియామకం ఉంటుందని అంటున్నారు. అయితే పరిశీలకులు చెప్పిన విధంగా పార్టీకోసం కష్టపడిన వారికి పట్టం కడుతారా.. పైరవీలతో వచ్చిన నాయకులకు పట్టం కడుతారా అనేది జిల్లా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.