14 July, 2026 | 4:50 AM

నిర్భయంగా ఫిర్యాదు చేయాలి

14-07-2026 12:00 AM

ఎస్పీ నితికా పంత్

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 13 (విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల వినతులను పరిశీలించిన ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా పారదర్శకంగా విచారించి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి మధ్యవర్తులు లేదా పైరవీలు ఆశ్రయించకుండా నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.