‘సర్’ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి
14-07-2026 12:00 AM
తహసీల్దార్ శ్రీకాంత్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూలై 13: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడు వులోగా పూర్తి చేయాలని తహసీల్దార్ బి శ్రీకాంత్ అన్నారు.సోమవారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో జరుగుతు న్న ఓటరు ఎన్యుమరేషన్ పత్రాల స్వీకరణ,డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని పరిశీలిం చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎల్‌ఓలు అందించిన ’సర్’ ఫారా లను ఓటర్లు తప్పులు లేకుండా పూరించి ఇవ్వాలని,సర్ కార్యక్రమంలో ఏ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోవద్దని చెప్పారు. అలాగే ఓటర్లు అందించిన సర్ ఫారాలను బీఎల్‌ఓలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ వెంకట్ రెడ్డి,బీఎల్‌ఓలు పరమేశ్వరి,చంద్రకళ,రాధ,రెవెన్యూ సిబ్బంది ఆనందం తదితరులు పాల్గొన్నారు.






