28 August, 2026 | 2:01 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

హెల్ప్‌డెస్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

13-07-2026 12:00 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, జూలై 12 (విజయక్రాంతి): ఎన్యుమరేషన్ ఫారంలను నింపడంలో ఓటర్లకు సహకరించేందుకు ఉచిత హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. యూసుఫ్ గూడ డివిజనులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా పరిశీలన,ఎన్యుమరేషన్ ఫారంలను నింపడం,ఎస్‌ఐఆర్ కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి హెల్ప్ డెస్క్ లు ఉపయోగపడతాయన్నారు.

వాటిని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అర్హులైన ప్రతి ఒక్కరి పేరు 2026 ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా కాంగ్రెస్ పార్టీ తరపున కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.ఓటర్లకు ఇబ్బంది తలెత్తకుండా పార్టీ అనుంబంధంగా ఉన్న బీఎల్‌ఏలు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. సహాయక చర్యలను మరింత వేగవంతంగా చేయాలని పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.