13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

31-03-2026 12:39 AM

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, మార్చి 30(విజయ క్రాంతి) :మెదక్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు ఏప్రిల్ 2న మెదక్ ప్రైవేట్ ఐటిఐ (విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా) లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అపోలో ఫార్మసీ సంస్థలో హైదరాబాద్ నందు పనిచేయుటకు అర్హతలు ఉన్నవారు హాజరు కావాలన్నారు.

18 సంవత్సరాల వయసు నుండి 35 సంవత్సరాల వయసు గలవారు, బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఏం ఫార్మసీ అర్హత, రూ. 19,726 జీతంతో 25 ఫార్మసిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు. 18 సంవత్సరాల వయసు నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి,డి ఫార్మసీ ,బి ఫార్మసీ ,ఏం ఫార్మసీ అర్హత, రూపాయలు 16,947 జీతంతో 20 ట్రైనీ ఫార్మసిస్ట్ ఉద్యోగాలు కలవన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి 10, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన రూ. 16,383 జీతం తో 25 ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.

18 నుంచి 208 సంవత్సరాల వయస్సు ఉండి బి బి ఏ,బి ఎస్ సి (కెమిస్ట్రీ, న్యూట్రీషియన్, ఫుడ్ సైన్స్) అర్హత కలిగి, రూపాయలు 18,640 జీతంతో 5 ప్రోడక్ట్ అడ్వైజర్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు. 18 సంవత్సరాల వయసు నుండి 26 సంవత్సరాల మధ్య ఉండి, పదవ తరగతి ,ఇంటర్, డిగ్రీ రూ.12,500 జీతంతో 25 రిటైల్ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయని, అర్హత, ఆసక్తిగల మెదక్ జిల్లాలో నిరుద్యోగ అభ్యర్థులు జాబ్ మేళాకు పూర్తి సమాచారంతో , అనుభవం ఉన్నవారు, ఫ్రెషర్స్ పాల్గొనవచ్చని సోమవారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాల కోసం 8247656356 నంబర్ను సంప్రదించాలన్నారు.