7న జరిగే టీబీఎన్‌ఆర్‌కేఎస్ మహాసభను జయప్రదం చేయండి
మహాసభ పోస్టర్ ఆవిష్కరణ చేసిన జిల్లా కన్వీనర్ తుడి అంజయ్య
బచ్చన్నపేట. మార్చి 30 విజయక్రాంతి: మండల కేంద్రంలో టిబిఎన్‌ఆర్ కేస్(TBNRKS) రాష్ట్ర కార్యదర్శి అల్వాల ఎల్లయ్య ఆధ్వర్యంలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దరిపల్లి చంద్రన్న పిలుపుమేరకు ఏప్రిల్ ఏడు నా జనగామ జిల్లాలో జరగబోయే మహాసభ వాల్ పోస్టర్ ను జిల్లా కన్వీనర్ తూడి అంజయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం కార్మిక శాఖ మంత్రి వెంకటస్వామి వివేక్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా మన సమస్యలను వివరించి సమస్యలను పరిష్కరించాలని. 55 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి 5000 రూపాయల పెన్షన్ తో పాటు. కార్మికుడు బ్రతికినంత కాలం కార్డును కొనసాగించాలని ప్రసూతి కాన్పుకు లక్ష రూపాయల వరకు పెంచాలని కార్మిక శాఖ మంత్రికి వినిపిస్తామని తెలియజేశారు.
కావున 7తారీఖు నాడు ప్రతి గ్రామ నుండి కార్మికలు అధిక సంఖ్యలో పాల్గొని వారి హక్కుల కోసం ఉద్యమించే విధంగా సూర్యపేట రోడ్డులోని భ్రమరాంబ ఫంక్షన్ హాల్ లో జరిగే మహా సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో, కో కన్వీనర్ నిర్మల సత్యం, గణిపాక లక్ష్మయ్య, దామెర బాల్ నర్సయ్య, బచ్చన్నపేట మండల అధ్యక్షులు జెర్రీపోతుల రాజు సర్పంచ్, మండల ప్రధాన కార్యదర్శి తుడుం రాజ్ కుమార్, టైల్స్ మండల అధ్యక్షులు గంధ మల్ల కిష్టయ్య, పర్వతాలు, అల్వాల గాలయ్య, రాగిశెట్టి కిషన్, రాగిరి సత్యనారాయణ, మల్యాల రమేష్, మొక్క అంజయ్య, తదితరులు పాల్గొన్నారు




