1 August, 2026 | 1:06 AM

మస్తాన్‌నగర్‌లో ‘వన్ వార్డ్ ఎవ్రీ డే’

01-08-2026 12:00 AM

పౌర సమస్యలపై ఎమ్మెల్యే, కమిషనర్ల సమీక్ష 

శేరిలింగంపల్లి,జూలై 31 (విజయక్రాంతి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ సిటీ వార్డు మస్తాన్నగర్ స్లమ్లో శుక్రవారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేష న్ (సిఎంసి) ఆధ్వర్యంలో ‘వన్ వార్డ్ ఎవరీ డే’ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కా ర్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సిఎంసి కమిషనర్ సృజన పాల్గొన్నారు. జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, డి ప్యూటీ కమిషనర్ బాలకృష్ణతో పాటు వివిధ శాఖల అధికారులు సమక్షంలో ఉన్నారు.

కాలనీ ని వాసితులతో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలను సమీక్షించారు.పాత బోర్వెల్లు, విద్యుత్ కనెక్ష న్ల మరమ్మత్తు, పనిచేయని వీధి దీపాల పునరుద్ధరణ?హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్బి నీటి సరఫరాలో తక్కువ ఒత్తిడి, అండర్గ్రౌండ్ డ్రైనేజీ లీకేజీలు, మురుగు నీరు తాగునీటితో కలవడం వంటి అం శాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.

ప్రభుత్వ భూమిపై కమ్యూనిటీ హాల్ నిర్మాణం అవసరమ ని నివాసితులు కోరారు.ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కమిషనర్ సృజన సమస్యలను గమనించి సంబంధిత శాఖల అధికారులను తక్షణం క్షేత్రస్థాయి పరిశీలన చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సిఎంసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వార్డులోనూ పౌరుల సమస్యలను నేరుగా గుర్తించి పరిష్కారం చేసే దిశగా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది.