మహేశ్వరంలో వీధికుక్కల స్వైరవిహారం
01-08-2026 12:00 AM
భయాందోళనలో గ్రామస్థులు
మహేశ్వరం, జులై 31(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేం ద్రంలో వీధి కుక్కల సంఖ్య పెరిగి ప్రజలు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన చౌరస్తా, పాఠశాల లు, జనసంచారం ఉన్న ప్రాంతాల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ వాహనాల వెంట పడుతుండటంతో కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగి వాహనదారులు కిందపడుతున్నారు.
మహిళలు, వృద్ధులు బయటకు రావాలంటేనేభయపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదాలు, కుక్కకాటు ఘటనలు జరగకముందే అధికారులు స్పందించి, వీధి కుక్కలను పట్టుకుని డాగ్ షెల్టర్లకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.






