07-10-2025 12:00:00 AM
మంచిర్యాల, అక్టోబర్ 6 (విజయక్రాంతి): జిల్లాలోని 73 ఏ4 మద్యం దుకాణానికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలోనీ కాలేజ్ రోడ్‌లో గల సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ లో 2025-27 సంవత్సరాలకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన కౌంటర్లలో సోమవారం పలువురు దరఖాస్తులు చేసుకున్నారు. మొదటిరోజు రెండు దరఖాస్తు రాగా సోమవారం మరో ఆరు దరఖాస్తులు వచ్చాయి.
జిల్లాలోని మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి ఎస్సై పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఇప్పటి వరకు ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను ఎక్సైజ్ సూపరింటెండెంట్ నందగోపాల్, ఎక్సైజ్ సిఐలు గురువయ్య, ఇంద్రప్రసాద్, హరి, సమ్మయ్య, కందుల తిరుపతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.