calender_icon.png 7 October, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్ అసెంబ్లీకి మోగిన నగారా

07-10-2025 01:38:54 AM

రెండు దశల్లో ఎన్నికలు  

నవంబర్ 6, 11 తేదీల్లో..14న ఓట్ల లెక్కింపు

ఢిల్లీ, అక్టోబర్ 6: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రెండు విడత లుగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగను న్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం గురు వారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తూ వివరాలు వెల్లడించింది.  పోలింగ్ తేదీలు, తదితర వివరాలను కేంద్ర ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్‌సింగ్ సంధు, వివేక్‌జోషితో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు.

నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6న మొదటి దశలో మధ్య బీహార్‌లోని 121 నియోజకవర్గాలకు, వరద పీడిత మరియు గ్రామీణ ప్రాంతాలకు, నవంబర్ 11న జరిగే రెండవ దశలో సరిహద్దు ప్రాంతాల్లోని 122 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది.

ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, సజావుగా సాగుతాయని బీహార్ ఓటర్లకు హామీ ఇస్తున్నామని ఆయ న పేర్కొన్నారు. ఓటరు జాబితా సవరణ తర్వాత జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నిక ఇది అని, 14 లక్షల మంది కొత్త ఓటర్లతో కలిపి మొత్తం 7.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు.ఓటరు జాబితా సవరణ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

అలాగే బీహార్‌లో నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై కూడా ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌కుమార్ స్పందించారు. ‘ఎస్‌ఐఆర్ ముసాయిదాను ఆగస్టు ఒకటిన విడుదల చేశాం. దానిని అన్ని రాజకీ య పార్టీలకు అందజేశాం. అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేసే అవకాశం ఇచ్చాం. తుది జాబితాను సెప్టెంబర్ 30న ప్రకటిం చాం.

ఇప్పటికీ అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాం’ అని తెలిపారు. ఎన్నికల నామి నేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు 10 రోజుల వరకు ఓటర్ల జాబితాలో దిద్దుబాట్లకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడిం చారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ సమాచారాన్ని ఎదుర్కోవడానికి ఈ సీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. గతం లో కంటే భిన్నంగా ఈసారి ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించినట్లు చెప్పా రు.

కాగా 2020లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. నితీశ్ కుమార్ రెండేళ్ల తర్వాత బీజేపీని వీడి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిశారు. ఆ బంధం ఎక్కువ రోజులు నిలువలేదు. 2024 జనవరిలో బీజేపీతో కలిసి నితీశ్ కుమార్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అక్టోబర్ 18, 28 తేదీల్లో దీపావళి, ఛాత్ పండుగలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వీటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను సిద్ధం చేసిందని భావిస్తున్నారు. ఒక్కో పోలింగ్ బూత్‌లో 1,200 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలిం గ్ కేంద్రాలను ఎన్నికల సంఘం 90 వేలకు పెంచింది. అలాగే ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫొటోలు వేసే ప్రక్రియను ఈ ఎన్నికలతోనే ప్రారంభిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు.

అలాగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఏడు రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లోని అంతా, ఝార్ఖం డ్‌లోని ఘటి శిలా, తెలంగాణలోని  జూబ్లీహిల్స్, పంజాబ్‌లోని తర్నారన్, మిజోరం లోని దంపా, ఒడిశాలోని నౌపాఢాతో పాటు జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని బడ్గామ్, నగ్రోటా స్థానాలకు ఉప ఎన్నికలె జరుగుతాయని ఈసీ పేర్కొంది.

అన్ని స్థానాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు 11 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి అజేష్ యాదవ్ మాట్లాడుతూ, ఢిల్లీ, పంజాబ్ తరహా పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ ప్రభు త్వం పాలన నమూనా, అభివృద్ధి ప్రజల ముందు ఉన్నాయని ఆయన అన్నారు. ఢిల్లీ, పంజాబ్‌ల్లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని తెలిపారు.

ఢిల్లీలో తమ విజ యానికి పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన ప్రజలు ఎంతో దోహదపడ్డారని వ్యాఖ్యానించారు. బెగుసరాయ్లో మీరా సింగ్, పూర్నియా జిల్లాలోని కస్బా స్థానంలో భాను భారతీయ, పాట్నాలోని ఫుల్వారీ స్థానంలో అరుణ్ కుమార్ రజక్, పాట్నాలోని బంకిపూర్లో పంకజ్ కుమార్, మోతీహరిలోని గోవింద్గంజ్లో అశోక్ కుమార్ సింగ్, బక్సర్ స్థానంలో రిటైర్డ్ కెప్టెన్ ధర్మరాజ్ సింగ్లను పార్టీ ప్రకటించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ సహ ఇన్‌చార్జి అభినవ్ రాయ్ తెలిపారు. 

ప్రజలతోనే తమ కూటమి ఉంటుందని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు సంస్కర ణల గురించి మాట్లాడుతున్నారని, కానీ తాము ఢిల్లీ, పంజాబ్‌ల్లో  ఎప్పుడో ప్రారంభించామని అన్నారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.