calender_icon.png 7 October, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు చెప్పండి

07-10-2025 12:00:00 AM

ఖానాపూర్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో విఫలమైందని రైతులకు మోసం చేసిందని దీన్ని ప్రజలకు చెప్పాలని బీఆర్‌ఎస్ కానాపూర్ నియోజకవర్గ జాన్సన్ నాయక్ తెలిపారు. సోమవారం ఖానాపూర్ పట్టణంలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ గెలిచేలా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలకు నాయకులకు తప్పకుండా టికెట్లు వస్తాయని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.