కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం
16-12-2024 04:54 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం సాయంత్రం ప్రారంభమయింది. ఈ కేబినెట్ సమావేశాన్ని అసెంబ్లీ కమిటీ హల్ లో నిర్వహిస్తున్నారు. చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని ఎల్లుండి టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నాట్లు తెలిపారు. కాంగ్రెస్ చలో రాజ్ భవన్ లో అదానీ, మణిపుర్ అంశాలపై మోదీ వైఖరిని నిరసిస్తూ, ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొననున్నారు.






